తెలంగాణ అసెంబ్లీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్ అయ్యారు. తాను సీనియర్ ఎమ్మెల్యేని, తనకి ఏం మాట్లాడాలో తెలుసని సహచర ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు. ఏం మాట్లాడాలో తనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈడబ్ల్యూఎస్ కాలనీలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని సభ దృష్టికి తెచ్చిన ఆయన.. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ పట్టించుకోవటం లేదని ఆరోపించారు.