మిస్ వరల్డ్ పోటీదారులు పోచంపల్లి చేనేత పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇకత్ చీరలను పరిచయం చేశారు. అంతేకాకుండా తయారీ విధానాన్నీ పరిశీలించి స్వయంగా చీరలను నేసి సంతోషపడ్డారు. ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు ఈ గ్రామాన్ని సందర్శించి.. స్థానిక సంస్కృతి, కళలు, మ్యూజిక్‌తో మమేకమయ్యారు.