Nagarkurnool District: సినిమాకి వెళ్లడానికి డబ్బులు ఇవ్వలేదని మైనర్ బాలుడు ఆ*త్మహత్య-minor boy commits suicide after being denied money to go to the cinema in nagar kurnool ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nagarkurnool District: సినిమాకి వెళ్లడానికి డబ్బులు ఇవ్వలేదని మైనర్ బాలుడు ఆ*త్మహత్య

Nagarkurnool District: సినిమాకి వెళ్లడానికి డబ్బులు ఇవ్వలేదని మైనర్ బాలుడు ఆ*త్మహత్య

Feb 03, 2025 03:11 PM IST Muvva Krishnama Naidu
Feb 03, 2025 03:11 PM IST

  • సినిమాకి వెళ్లడానికి డబ్బులు ఇవ్వలేదని ఉరేసుకొని మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం ఈదమ్మ గుడి కాలనీలో చోటు చేసుకుంది. మైనర్ బాలుడు కార్తీక్ తండ్రి గణేష్.. దినసరి కూలీ. కార్తీక్ తల్లి సూపర్ మార్కెట్లో పనిచేస్తూ ఉంటుంది. అయితే తల్లిదండ్రులు గుడికి వెళుతున్న క్రమంలో కొడుకు కార్తీక్ సినిమాకి వెళ్లడానికి డబ్బులు అడగగా తండ్రి లేవని చెప్పారు. ఆ తర్వాత గుడికి వెళ్లారు. డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు కార్తీక్. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

More