Minister KTR On BJP : అర్వింద్.. దమ్ముంటే కేంద్రం నుంచి వాటిని సాధించుకొని రా
- BRS vs BJP: బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. శనివారం నిజామాబాద్ లో పర్యటించిన ఆయన... తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. ఫిబ్రవరి 1వ తేదీన పెట్టబోయే బడ్జెట్ మోదీకి చివరిది అని... కనీసం ఇప్పుడైనా తెలంగాణకు ఏం ఇచ్చారో... ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను టార్గెట్ చేశారు కేటీఆర్. దమ్ముంటే, చేతనైతే తెలంగాణ రావాల్సిన హక్కులను కేంద్రం వద్ద సాధించుకొని రా అంటూ అరవింద్ కు సవాల్ విసిరారు. పసుపు బోర్డు విషయంలో మోసం చేశారని దుయ్యబట్టారు.