Minister KTR On MLA Raghunandan: వకీల్ సాబ్.. మీరు చెప్పింది కూడా అలాగే ఉంది
- Telangana Assemblu Budegt Sessions 2023 Updates: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు. ఈ క్రమంలో బీజేపీ తరపున ఎమ్మెల్యే రఘనందన్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పలు విమర్శలు చేశారు.తెలంగాణ ప్రభుత్వానికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సినవి, చేయాల్సిన అన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం అందిస్తోందన్నారు. గవర్నర్ తమిళిసై చేసిన బడ్జెట్ ప్రసంగంలోనూ కేంద్రాన్ని విమర్శించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు లేకపోవడం కూడా ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వీటిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. రఘనందన్ పై సెటైర్లు విసిరారు. కేంద్రం ప్రభుత్వం తరపున మాట్లిడన వకీల్ సాబ్ ప్రసంగంలో ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు