తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలుగు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణకు సంబంధించిన పార్టీలు అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ.. నేతలు సొంత అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్టుపై MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆంధ్రలో చంద్రుడు ప్రశాంతంగా జైల్లో ఉన్నాడంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. ఏపీలో ప్రస్తుతం రెండే ఆప్షన్స్ ఉన్నాయని, ఒకటి తెలుగుదేశం, రెండు జగన్‌మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పుకొచ్చారు. జగన్ పాలన పర్వాలేదన్నారు అసదుద్దీన్.