Cardiac Arrest: బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు-man dies of heart attack while playing badminton in hyderabad ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cardiac Arrest: బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు

Cardiac Arrest: బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు

Published Mar 01, 2023 06:36 PM IST HT Telugu Desk
Published Mar 01, 2023 06:36 PM IST

  • Man Dies Of Heart Attack While Playing Badminton: గుండెపోటు కేసులు.... ఈ మధ్యకాలంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. మన మధ్యలోనే ఉంటూ సంతోషంగా గడుపుతూ ఒక్కసారిగా పడిపోతున్నారు. కొందరు స్టేజీలపై డ్యాన్స్ లు, ప్రసంగాలు చేస్తూ కిందపడిపోయి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక జిమ్స్ లో వర్కౌట్స్ చేస్తూ చనిపోతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. అయితే తాజాగా సికింద్రాబాద్ పరిధిలో మరో మరణం చోటు చేసుకుంది. లాలాపేట స్టేడియంలో బ్యాడ్మింటన్‌ ఆడుతూ పరమేష్‌ యాదవ్‌(38) అనే వ్యక్తి కుప్పకూలాడు. వెంటనే అక్కడున్న వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్టు వైద్యుల ధ్రువీకరించారు.

More