భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమవుతోంది. వరదలు పోటెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లా, ఏటూరు నాగారం, కొండాయి గ్రామంలో సుమారు వంద మంది వరదల్లో చిక్కుకున్నారు. ఆరుగురు గల్లైంతనట్లు తెలిసింది. ఈ మేరకు మలుగు ఎమ్మెల్యే సీతక్క వారిని రక్షించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ తో మాట్లాడి సహాయ చర్యలకు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సీతక్క తెలిపారు.