రేవంత్ రెడ్డి సర్కారు అందాల పోటీల మీదే కాకుండా అగ్ని ప్రమాదాల మీద కూడా దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. భాగ్యనగరంలోని పాతబస్తీలో ఉన్న గుల్జార్ హౌజ్ వద్ద అగ్నిప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. రూ.5 లక్షల పరిహారం కాదని, రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.