అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశంలా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గవర్నర్‌తో పచ్చి అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలు లేవని, 20 నుంచి 30 శాతానికి మించి రైతులకు రుణమాఫీ జరగలేదని అన్నారు. సీఎం రేవంత్ చేతకానితనం వల్ల అనేక ఎకరాలకు నీరు అందడం లేదని మండిపడ్డారు.