తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. FIRలో పేరు లేని వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ వల్ల.. తెలుగుదేశం పార్టీకి మైలేజ్ బాగా పెరిగిందన్నారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు పెరుగుతోందన్నారు. వైసీపీ నేతల వ్యవహారం సుద్దపూసలాగా ఉంటుందని విమర్శించారు. ఎవరైనా మద్దతు ఇస్తే చాలు.. వ్యతిరేకంగా మాట్లాడుతారని అన్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని ప్రజలు తిరగబడే పరిస్థితి భవిష్య త్ తో వస్తుందన్నారు. మాజీ సీఎంను ఆదరాబాదరాగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. జీ-20 సమావేశాల సమయంలోనే అరెస్టు చేయడానికి పోలీసులకు సమయం కుదిరిందా అని ప్రశ్నించారు.