చాలామంది భూములు కొనుగోలు చేస్తారు. ఆ సమయంలో అన్ని పత్రాలు సరిగా చూసుకోరు. కొంత కాలం తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు. తెలంగాణలో భూములు కొనేవారు ముఖ్యంగా పహాణీ, అడంగల్ గురించి తెలుసుకోవాలి. పహాణీ, అడంగల్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో భూమికి సంబంధించిన ముఖ్యమైన రెవెన్యూ రికార్డులు. వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.