బోడుప్పల్, పీర్జాదిగూడ పరిధిలో స్మశానాలు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలు చేపట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. వెంటనే యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే గురువారం ఉదయం యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు. పర్వతాపూర్ లోని కబ్జాకు గురైన స్మశాన వాటికలలోని అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. ఈ క్రమంలోనే నిర్మాణ దారులు ఆందోళన చేశారు. హైడ్రా సిబ్బందిని అడ్డుకున్నారు.