Suryapet: దారుణంగా చంపి నదిలో విసిరేసి.. సూర్యాపేటలో మరో పరువు హత్య-honor killing took place in mamillagadda suryapet ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Suryapet: దారుణంగా చంపి నదిలో విసిరేసి.. సూర్యాపేటలో మరో పరువు హత్య

Suryapet: దారుణంగా చంపి నదిలో విసిరేసి.. సూర్యాపేటలో మరో పరువు హత్య

Jan 27, 2025 12:26 PM IST Muvva Krishnama Naidu
Jan 27, 2025 12:26 PM IST

  • తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటలో పరువు హత్య జరిగింది. సూర్యాపేటలోని మామిళ్లగడ్డలో ఘటన చోటు చేసుకుంది. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసీ నది కట్టపై వడ్లకొండ కృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. ఆ యువకుడిని బండరాళ్లతో మోది హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణ.. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రేమ వివాహం చేసుకోవ‌డం వ‌ల్లే హ‌త్య గురయ్యాడనే వాద‌న బలంగా వినిపిస్తున్న‌ది. ఇదే స‌మ‌యంలో పాత కక్షలూ హత్యకు దారి తీసినట్లు మరో అనుమాన వ్యక్తం చేస్తున్నారు.

More