తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని తేలటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల చెల్లదని తీర్పు ఇచ్చింది. రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది. 2018 ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి తర్వాతి స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ప్రకటించింది.