తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాలను ముంచెత్తుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 434 మి.మీ భారీ వర్షపాతం నమోదైంది.భూపాలపల్లి-పరకాల ప్రధాన దారిపై మెురంచవాగు 15 అడుగుల ఎత్తులో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మొరంచపల్లి గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఇక హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల, కొత్తగూడెం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరంగల్ వాసులు తీవ్ర అవస్తలు ఎదుర్కొంటున్నారు.