heavy rain in vikarabad | వికారాబాద్ జిల్లాలో ఒక్కసారిగా వడగండ్ల వాన
- వికారాబాద్ జిల్లాలో ఒక్కసారిగా వడగండ్ల వాన కురిసింది. పరిగి, పూడురు మండలాల పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఇక హైదరాబాద్ పరిధిలోనూ వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం మొదలైంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. మణికొండ, కొండాపూర్, లింగంపల్లి, షేక్ పేట్, రాజేంద్రనగర్, కూకట్ పల్లి, పటాన్ చెరువు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి.