హయత్ నగర్ లోని కుంట్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అంటే ఈ ఉదయం తెల్లవారు జామున కారు, డీసీఎంను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కారు అతివేగం వల్లే జరిగిందని తెలుస్తోంది. అక్కడ దగ్గర్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.