రైతన్నల తరపున తమ అధినేత కేసీఆర్ ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇవాళ ఎండిన వరితో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ నేతలు, రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం 35 రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి నీళ్లు ఇచ్చేసరికి ఒక జనగామ జిల్లాలోనే రూ.600 కోట్ల పంట నష్టం జరిగిందన్నారు. పంట ఎండిపోయిన ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పంటలు ఎండి పోయాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనమే అని అన్నారు.