Sarpanches Arrest in Telangana: ఊరికి సేవ చేసే వారిపై.. ఇదేం పాలన రేవంత్ రెడ్డి?-former minister harish rao condemns arrest of former sarpanches ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sarpanches Arrest In Telangana: ఊరికి సేవ చేసే వారిపై.. ఇదేం పాలన రేవంత్ రెడ్డి?

Sarpanches Arrest in Telangana: ఊరికి సేవ చేసే వారిపై.. ఇదేం పాలన రేవంత్ రెడ్డి?

Published Nov 04, 2024 01:18 PM IST Muvva Krishnama Naidu
Published Nov 04, 2024 01:18 PM IST

  • రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్‌ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు. మాజీ సర్పంచులకు మద్దతుగా బొల్లారం పోలీస్ స్టేషన్ ముందు హరీష్ రావు బైఠాయించారు. వినతీ పత్రం ఇచ్చేంత వరకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అటు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ వద్ద కవరేజీ కి వచ్చిన జర్నలిస్టులు వెళ్లిపోవాలంటూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.

More