బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చాలా బాగా పని చేస్తున్నారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ కితాబిచ్చారు. వరంగల్‌లోని ఎల్కతుర్తిలో నిర్వహించిన BRS రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పోలీసులు ఎందుకు ఎగురుతున్నారని ప్రశ్నించిన కేసీఆర్.. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్‌పై కేసులు పెడుతున్న వారి పేర్లు డైరీల్లో రాసుకోవాలన్నారు.