కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ అడుగు పెట్టారు. కాషాయదళం కార్యకర్తలు బాణసంచాలు పేల్చి సంబురాలు చేసుకున్నారు. జై జై బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు. వినూత్న రీతిలో బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కరీంనగర్ గడ్డను ముద్దాడి నమస్కరించారు బండి సంజయ్.