గ్రామానికి కీడు సోకిందని కరీంనగర్ జిల్లా విలాసాగర్ గ్రామస్థులు భావిస్తున్నారు. దీంతో సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు ఊరు బయటే వంటావార్పు చేసుకుంటూ జీవనం సాగించారు. ఈ గ్రామంలో నెల రోజుల్లో 11 మంది మృతి చెందారు. ఒకరి దిన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు మృతి చెందుతుండడంతో జనం భయపడ్డారు. ఓ వ్యక్తిని ఈ విషయంపై అడగ్గా.. గ్రామాన్ని వదిలి బయట కీడు వంటలు చేసుకోవాలని సూచించారని ప్రజలు చెప్పారు. దీంతో ఒక రోజులంతా ఇలా చేశారు అక్కడి జనం. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు పోవటం లేదని వైద్యులు అంటున్నారు.