హైదరాబాద్ నగరంలో బుధవారం వాన కుమ్మేసింది. వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అత్యధికంగా రాత్రి 11 గంటలకు వరకు బండ్లగూడలో 8.88 సెంటిమీటర్లు, అంబర్ పేటలో 8.50, సైదాబాద్ 8.38, సరూర్ నగర్ 8.08, ఉప్పల్ 7.75, హిమాయత్ నగర్ 6.30, చార్మినార్లో 5.85 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల కురిసిన వర్షానికి వాహనాలు కొట్టుకుపోయాయి.