తెలంగాణ మంత్రులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ నగరం అంతా అందాల భామల చుట్టే తిరుగుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. రాష్ట్ర మంత్రులంతా అందాల భామల వెనుక సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో పార్టీ కార్యదర్శి సాంబశివరావుతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. భామల కోసం కోట్లల్లో ఖర్చుపెట్టేది సొల్లు కార్చుకోవడానికా అని ప్రశ్నించారు.