తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ నేతలపై సీఎం రేవంత్ విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆడపిల్లను జైలుకు పంపారని రేవంత్ అన్నారు. అందుకే ఎమ్మెల్సీ కవిత జైలుకు పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.