తెలంగాణలో ఉపఎన్నికలు రావని ప్రతిపక్షాలకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు లేవనెత్తిన పలు అంశాలపై స్పందిస్తూ మాట్లాడిన సీఎం.. ఉప ఎన్నికల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచించారు. ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరినా, వెనక్కి వెళ్లినా ఉప ఎన్నికలు రావని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.