దళిత బంధు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందా అనే పార్టీ నాయకుల మాటలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో మాట్లాడిన KTR.. దళిత బంధు వల్ల రాజకీయంగా కొంత నష్టం జరిగి ఉండవచ్చని అన్నారు. కానీ కేసీఆర్ లాంటి ఖలేజా ఉన్న నాయకుడు మాత్రమే దళిత బంధు గురించి ఆలోచిస్తారని చెప్పారు. ఎప్పుడిస్తారు అంబేద్కర్ అభయహస్తం? అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తారని రేవంత్ రెడ్డి సర్కారుని KTR నిలదీశారు.