మాజీ సీఎం కేసీఆర్ సహా హరీష్ రావుకు నోటీసులు ఇవ్వటంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయన్నారు. మీవన్నీ చిల్లర ప్రయత్నాలని కేటీఆర్ మండిపడ్డారు.