HCUకి వచ్చి ఫుట్ బాల్ ఆడినప్పుడే ఆ భూముల మీద రేవంత్ రెడ్డకి కన్ను పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. భూమిని అమ్మితే వచ్చే కమిషన్ల కోసం పిల్లలను దారుణంగా కొట్టి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని ఆయనే అన్నారని గుర్తు చేశారు. అప్పుడు మనం నమ్మలేదు కానీ ఇప్పుడు అదే జరుగుతుందని ఎద్దేవా చేశారు.