కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఇవాళ శాసన మండలికి వచ్చిన సమయంలో హామీ అమలు కోసం నిరసన తెలిపారు. యువతకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రియాంక జీ మీరు ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారని కవిత నిలదీశారు.