శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిరసనకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ప్లకార్డులు చేతబట్టుకుని నిరసన తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. బంగారం కడ్డీల నమూనాలను ప్రదర్శిస్తూ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన జంటలు తులం బంగారం కోసం ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్సీలు కామెంట్ చేశారు.