అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కార్యకర్తలను వేధించిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటామని తెలిపారు. బెదిరేంచే అధికారులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు.