తెలంగాణ అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం ఏర్పాటుచేయాలనే డిమాండ్‌తో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టారు. బీసీల ఆత్మ బంధువు పూలే అని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. AI అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని అన్నారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుందన్న కవిత.. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.