MLC Kavitha: ఇందిరమ్మ రాజ్యంలో ఇంటి ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం.. ఈ రిజర్వేషన్లు దారుణం
- ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్నదని BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఉద్యోగ అవకాశాల్లో మహిళల హక్కలను హరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణలో ఆడబిడ్డలకే కాకుండా వికలాంగుల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగే జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 3ను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కవిత లేఖ రాశారు.