కేసీఆర్ ఉద్యమం ప్రారంభం ముందు.. ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎంతో చెప్పాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ చేశారు. బీజేపీని దెబ్బ కొట్టేందుకు దేశవ్యాప్తంగా కేసీఆర్ పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే బీసీ ప్రధానిని కేసీఆర్ కుటుంబం ఓర్చుకోలేకపోతోందని మండిపడ్డారు. కేటీఆర్ అంత పెద్ద చీటర్ ఇంకొకరు లేరన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబంలో ఆ నలుగురికి మాత్రమే న్యాయం జరుగుతోందని, నాలుగు కోట్ల ప్రజలు అన్యాయం అవుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఇప్పటికే కేసీఆర్ కుటుంబంలో గొడవ ప్రారంభమైందని, ఎప్పుడైనా ఆ పార్టీలో చీలిక రాబోతోందని అన్నారు బండి సంజయ్.