మేడారం మహాజాతర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు రానున్నారు. గురువారం గద్దెల మీదకు సమ్మక్క చేరనుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భక్తులు మేడారం జాతరకి చేరుకుంటున్నారు. నాలుగు రోజుల్లోనే రెండు కోట్లకు పైగా భక్తుల ఈ గిరిజన జాతరలకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మేడారం పరిసరాలు జనసంద్రంగా మారాయి. లక్నవరం సరస్సు నుంచి జంపన్నవాగుకు చేరిన నీళ్లులో భక్తులు స్నానాలు చేస్తున్నారు.