TRS MLAs Poaching Case : యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేసిన బండి సంజయ్
- Bandi Sanjay took oath in Yadadri temple: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్.. యాదాద్రి ఆలయంలో శుక్రవారం ప్రమాణం చేశారు. తడి బట్టలతో ఆలయంలోకి వచ్చిన బండి సంజయ్.. ఈ వ్యవహారంలో తమ పార్టీకి, నాయకులు ఎలాంటి సంబంధం లేదని అక్షితలు, తులసీ మాలపై ప్రమాణం చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నిజాయితీ నిరూపించుకోవడానికి.. సీఎం కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. బండి సంజయ్ యాదాద్రికి వచ్చిన క్రమంలో టీఆర్‌ఎస్ నేతలు నిరసనలు తెలిపారు.