తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా భావిస్తే.. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు ఎందుకు రాలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ కలిసి పోటీ చేసే పరిస్థితి ఉందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.