కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఎంపీ బండి సంజయ్ ఖండించారు. పాలనలో మంత్రి కేటీఆర్ అన్ ఫిట్ అని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ అంతేనని.. అంతకు మించి ఏమీ లేదన్నారు. తండ్రి పేరు చెప్పుకొని మోదీ, కిషన్ రెడ్డి రాజకీయాల్లోకి రాలేదన్నారు. కిషన్ రెడ్డి కష్టపడి పార్టీలో పైకొచ్చి ఈ పదవిలో ఉన్నారని బండి సంజయ్ అన్నారు. కృష్ణా జలాల వాటాపై కేసీఆర్ మోసం చేశారన్నారు. ఒక్క మోటార్ తో పది లక్షల ఎకరాల పారుతుందా అని ప్రశ్నించారు.