Telugu News  /  Video Gallery  /  Asaduddin Owaisi On Assam Govt Over Child Marriages

Owaisi on Assam Child Marriages : భర్తల అరెస్టు సరే.. భార్యల పరిస్థితేంటి?

05 February 2023, 15:03 IST Anand Sai
05 February 2023, 15:03 IST
  • బాల్య వివాహాలపై అసోం ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. బాల్య వివాహాలు చేసుకున్న దాదాపు 2 వేల మందిని అరెస్ట్ చేశారు. 4,004 కేసులు నమోదు అయ్యాయి. అసోం ప్రభుత్వ చర్యలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. '6 ఏళ్లుగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. దాని గురించి వారు ఏమి చేశారు? అది వారి వైఫల్యం. ఎన్ని పాఠశాలలు తెరిచారు? వారు చర్యలు తీసుకుంటున్నారు సరే.. వివాహం చేసుకున్న అమ్మాయిల గురించి ఏం చేస్తారు? అస్సాం ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోంది.' అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
More