తెలంగాణలో శాసన సభ సమావేశాలు జరుగుతున్న వేళ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగ భద్రత కోరతూ అడ్వకేట్లు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్యపై నిరసన తెలియజేసిన న్యాయవాదులు.. తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ ఆధ్యర్యంలో శాసన సభను ముట్టించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, అడ్వకేట్‌లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, వివిధ స్టేషన్లకు తరలించారు.