ACB Raids On MRO: ACB: జమ్మికుంట తహసీల్దార్ ఆస్తులపై ఏసీబీ కీలక ప్రకటన
- వరంగల్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజని, ఆమె సన్నిహితుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో రూ. 3 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.12 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం హనుమకొండలోని కేఎల్‌ఎన్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రజని ఏడు నెలల క్రితం వరకు ధర్మసాగర్ తహసీల్దార్‌గా పనిచేశారు. ఎన్నికల సమయంలో జమ్మికుంటకు బదిలీ అయ్యారు. ఆమె అక్రమార్జనకు పాల్పడుతోందంటూ ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లడంతో.. బుధవారం రజని ఇంటితోపాటు ఆమె సన్నిహితులైన ఐదుగురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు.