తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, కేటీఆర్ కు మధ్య మాటల యుద్ధం జరిగింది. BRS పాపం వల్ల రూ. లక్ష కోట్ల బిల్లులు పెండింగులో ఉంటే క్లియర్ చేస్తున్నామని చెప్పారు. ఈ బిల్లులు పెండింగ్ ఉండటం వల్ల ఆ వర్గం వాళ్లందరూ ఏడుస్తున్నారని అన్నారు. ఈ టైంలో కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.