తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొన్ని రకాలుగా కలిసి వస్తోందనే చెప్పాలి. ఓ మహిళ బస్సు ప్రయాణం చేస్తూనే కూరగాయల వ్యాపారం చేసింది. మహబూబ్ నగర్ నుండి పరిగి వచ్చే బస్సులో మహాలక్ష్మి..కూరగాయలతో ఎక్కింది. ఇక అందులో ఉన్న ప్రయాణికులు ఆమె వద్ద ఉన్న బెండకాయలు చూశారు. ఎంతా అని అడిగారు. సరసమైన ధర ఉండటంతో అక్కడే తూకం వేయించుకొని బెండకాయలు కొన్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. మహాలక్ష్మిని నెటిజన్లు అభినందిస్తున్నారు.