14 రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి ఓ తల్లి చంపేసిన ఘటన హైదరాబాద్ మైలార్దేవ్ పల్లిలో చోటు చేసుకుంది. పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి.. ప్రమాదవశాత్తు చనిపోయినట్లు బంధువులకు చెప్పింది. స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని తల్లి విజ్జు నాటకం ఆడింది. అయితే ఘటనపై పోలీసులు విచారణ జరపగా.. విజ్జునే పసికందుని చంపినట్లుగా నిర్ధారించారు. భర్తకు రెండు కిడ్నీలు చెడిపోవడం, కుటుంబ పోషణ భారంగా మారడంతో హత్య చేసినట్లు విజ్జు ఒప్పుకుంది. అయితే కొంత కాలం క్రితమే పొట్ట కూటి కోసం ఈ దంపతులు మణి, విజ్జు హైదరాబాద్ వచ్చారు.