వీడియో : 'కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ ను ఎందుకు విడిచిపెడుతున్నారు..?' ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు-telangana jagruthi maha dharna at indira park in hyderabad kavitha slams congree govt over kaleshwaram issue ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వీడియో : 'కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ ను ఎందుకు విడిచిపెడుతున్నారు..?' ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు

వీడియో : 'కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ ను ఎందుకు విడిచిపెడుతున్నారు..?' ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు

Published Jun 04, 2025 12:49 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 04, 2025 12:49 PM IST

ఎమ్మెల్సీ కవిత ఇందిరాపార్క్ వద్ద దీక్షను చేపట్టారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై నిరసనను వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత... కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టొచ్చని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టొచ్చన్నారు. కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్‌తో 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కు పేరు రావొద్దని ప్రభుత్వం కుట్ర చేస్తోందని.. అందులో భాగంగానే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం…. నిర్మించిన కాంట్రాక్టర్ ను ఎందుకు విడిచిపెడుతున్నారని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కవిత స్పీచ్ ను ఈ వీడియోపై క్లిక్ చేసి వీక్షించండి….

More