Taliban-Pakistan Clash: తాలిబన్లు, పాకిస్థాన్ సైన్యం మధ్య ఘర్షణలు
- Afghanistan Taliban-Pakistan Durand Line Clash: డూరండ్ సరిహద్దు వద్ద అప్ఘానిస్థాన్కు చెందిన తాలిబన్ సైన్యం, పాకిస్థాన్ దళాల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. ఈ తాజా ఘటనలో ఓ పాకిస్థానీ సైనికుడు మరణించగా.. మరికొంత మంది జవాన్లు, పౌరులు గాయపడ్డారు. కొందరు తాలిబన్ ఫైటర్లు కూడా గాయాలపాలయ్యారు. పాకిస్థాన్ వైపు నుంచి డూరండ్ సరిహద్దు వద్ద కొందరు ప్రజలు ఆందోళన చేస్తుండగా.. వారిపై తాలిబన్ ఫైటర్లు ముందుగా కాల్పలు చేసినట్టు రిపోర్టులు వచ్చాయి. దీంతో పాకిస్థాన్ సైన్యం కూడా ఎదురుదాడి చేసిందని, దీంతో ఘర్షణ చెలరేగిందని తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.