వన్డే ప్రపంచ కప్-2023 కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టికెట్లను కూడా విడుదల చేసింది. అయితే చాలా మంది క్రికెట్ అభిమాలు, టికెట్లు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ లో చూసిన అక్కడా లేవని, ఒకవేళ ఉన్నా వేలల్లో టికెట్ ధరలు పెట్టారని వాపోతున్నారు. భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు దేశం మెుత్తం ఆసక్తిగా ఉంటుందని, అటువంటప్పుడు ఎందుకు బీసీసీఐ ఇలా చేస్తోందని క్రికెట్ అభిమానులు ప్రశ్నించారు. కొందరు ఒడిస్సా సహా పలు రాష్ట్రాల నుంచి అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియాని ఆఫ్లైన్ లో టికెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఇక్కడ కూడా లేవనటంతో తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.