Modi-Team India | కోహ్లి, రోహిత్ శర్మ వెన్నుతట్టిన ధైర్యం చెప్పిన ప్రధాని మోదీ-pm modi visits indian criketers dressing room after defeat to australia team ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Modi-team India | కోహ్లి, రోహిత్ శర్మ వెన్నుతట్టిన ధైర్యం చెప్పిన ప్రధాని మోదీ

Modi-Team India | కోహ్లి, రోహిత్ శర్మ వెన్నుతట్టిన ధైర్యం చెప్పిన ప్రధాని మోదీ

Published Nov 21, 2023 11:24 AM IST Muvva Krishnama Naidu
Published Nov 21, 2023 11:24 AM IST

  • అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవటంతో టీమిండియా ఆటగాళ్లందరూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇది చూసిన ప్రధాని నరేంద్ర మోదీ భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లారు. ఆటగాళ్లతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్కరినీ మాట్లాడించారు. కోచ్ ద్రవీడ్ తో సైతం మాట్లాడారు. ఈ సందర్భంగా షమీని మెచ్చుకున్నారు. ఆటలో ఓటమి, గెలుపు సహజమని అన్నారు. ఇక ఆదివారం మ్యాచ్ లో 241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 6 వికెట్లు, మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే దానిని ఛేదించింది. ఫైనల్ ముగిసే సమయానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటతడి పెట్టారు. ఓటమి తర్వాత మిగిలిన జట్టు సభ్యులు కూడా చాలా ఎమోషనల్‌గా కనిపించారు.

More